విదేశాల నుంచి హైదరాబాద్కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అక్రమార్కులు మాత్రం స్మగ్లింగ్ ఆపట్లేదు. కాకపోతే.. తరలించే పద్ధతిని మాత్రం మారుస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్తగా స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇలా కూడా బంగారాన్ని తరలించొచ్చా..? అనే ఆశ్చర్యం కలిగేలా అక్రమ రవాణా సాగుతోంది. అక్రమార్కులు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా.. అధికారులు వారిని పట్టుకుని.. వారి ప్రణాళికలను పటాపంచలు చేస్తూనే ఉన్నారు. లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు కిలోకు పైగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి దుబాయ్ మీదుగా హైదారాబాద్ వచ్చిన విదేశీయురాలిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మూటాముల్లెతో పాటు చేతి సంచిని కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఇంకొంచెం లోతుగా తనిఖీ చేయగా.. దాచిన పుత్తడి బయటపడింది.