తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape Attempt on Disabled: నడవలేని అమ్మాయిపై తాత వయసున్న వ్యక్తి అత్యాచారయత్నం.. - rape attempt on physically handicapped women

Rape Attempt on Disabled: వావి వరసలు ఉండవు.. ఏ స్థితిలో ఉన్నా సంబంధం లేదు. అమ్మాయి అయితే చాలు వాళ్లకు. ఇంగితం కళ్లు మూసుకుపోతుంది. పైశాచికత్వం ఒళ్లు విరుచుకుంటుంది. కామం కోరలు చాస్తుంది. మంచానికి పరిమితమైన ఓ దివ్యాంగురాలిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి యత్నించిన ఘటన.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

55 year man Rape Attempt on 20 year Disabled in illandhu mandal
55 year man Rape Attempt on 20 year Disabled in illandhu mandal

By

Published : Dec 14, 2021, 3:27 PM IST

Rape Attempt on Disabled: నడవలేని దివ్యాంగురాలన్న జాలి కూడా లేదు. మనవరాలి వయసున్న అమ్మాయి అన్న కనీస జ్ఞానం లేదు. తాత వయసు ఉన్న కామాంధుడు ఓ దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మసివాగు పంచాయతీ ధర్మారం తండాలో చోటు చేసుకుంది.

మంచానికే పరిమితమైన 20 ఏళ్ల దివ్యాంగురాలిపై.. వాళ్ల ఇంటి పక్కనే ఉన్న దేవుల(55) కన్నుపడింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం కోసం చూశాడు. ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలిపై తన కామవాంఛ తీర్చుకునేందుకు పశువులా ఎగబడ్డాడు. మంచంలో ఉన్న యువతికి చాక్లెట్లు తినిపించి.. నోరు మూసి బలవంతం చేయబోయాడు. యువతి కేకలు వేయటంతో స్థానికులు అటుగా రావటంతో.. దేవుల పరారయ్యాడు.

ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలో విచారణ చేపట్టారు. యువతి కేకలు వినిపించాయని స్థానిక మహిళలు తెలపగా... దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details