Bus Accident: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోని కుమురంభీం చౌరస్తా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న వస్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించడానికి సడెన్ బ్రేక్ వేయగా.. ఆ బస్సు వెనకాలే వస్తున్న మరో బస్సు బలంగా ఢీకొట్టింది.
బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన మరో బస్సు.. 50 మందికి గాయాలు - ts news
Bus Accident: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కుమురంభీం చౌరస్తా వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు 50 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు.
బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన మరో బస్సు.. 50 మందికి గాయాలు
జగిత్యాల బస్సు ముందు రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి పడిపోగా.. వారిని కాపాడాలని ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు బస్సుల్లోని సుమారు 50 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమందిని మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:
TAGGED:
bus accident at khanapur