అసైన్డ్‌భూముల్లో ఉంటున్న పేదల గుడిసెలకు ఓ వ్యక్తి నిప్పుపెట్టిన ఘటన... వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట శివారు కాకతీయనగర్‌లో జరిగింది. అసైన్డ్ భూమిలో దాదాపు 300 కుటుంబాలు గుడిసెలు వేసుకొని నెలరోజులుగా జీవనం సాగిస్తున్నాయి.
మంటలు అంటుకుని 50 గుడిసెలు దహనం - నర్సంపేట కాకతీయనగర్ వద్ద గుడిసెలు దహనం
వరంగల్ గ్రామీణం జిల్లా నర్సంపేట కాకతీయనగర్ వద్ద గుడిసెలు దహనమయ్యాయి. అసైన్డ్ భూముల్లోని గుడిసెలకు ఓ వ్యక్తి నిప్పుబెట్టాడు. మంటలు అంటుకుని 50 గుడిసెలు దగ్ధమయ్యాయి.
తన భూమిలో గుడిసెలు వేసుకున్నారంటూ... వెంకటయ్య సుమారు 40 మందితో కలిసి మారణాయుధాయులతో అక్కడి ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. గుడిసెలకు నిప్పు పెడుతుండగా అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఘటనలో నలుగురికి గాయాలుకాగా.... 50 గుడిసెలతో పాటు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దాడికి పాల్పడిన వారిలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు దాడికి పాల్పడ్డారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:లాక్డౌన్ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు