వికారాబాద్ జిల్లా పరిగి సబ్స్టేషన్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఇన్నోవా కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు ముందు టైర్లు పేలడంతో... వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది.
కారు బోల్తా... ఆరుగురికి గాయాలు - పరిగి వార్తలు
కారు ముందు టైర్లు పేలి... వాహనం పల్లీలు కొట్టి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన పరిగి సబ్స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలవ్వగా... ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
కారు బోల్తా... ఆరుగురికి గాయాలు
ప్రమాదంలో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా... ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు... క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు కర్ణాటకలోని శుర్పూర్లో జరుగుతున్న జాతరకు హైదరాబాద్ నుంచి వెళ్తున్నట్లు తెలిపారు.