Jubilee hills case: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురు మైనర్లను ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు అనుమతిచ్చింది. ఈ కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిని రేపట్నుంచి ఐదురోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. రేపట్నుంచి జువైనల్ హోమ్‌లోనే మైనర్లను పోలీసులు విచారించనున్నారు. న్యాయవాది సమక్షంలో మైనర్ల నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ దుస్తుల్లోనే విచారణ జరపాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
Jubilee hills case: మైనర్లకు ఐదు రోజుల కస్టడీ.. సాదుద్దీన్‌ను ఐదుగంటల పాటు ప్రశ్నించిన పోలీసులు - jubilee hills case cctv
17:29 June 09
Jubilee hills case: మైనర్లకు ఐదు రోజుల కస్టడీ.. సాదుద్దీన్‌ను ఐదుగంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను పోలీసులు మొదటి రోజు ప్రశ్నించారు. దాదాపు 5 గంటల పాటు సాదుద్దీన్‌ను ప్రశ్నించిన పోలీసులు... అతని నుంచి కొంత సమాచారం సేకరించారు. పబ్‌లో పార్టీకి ప్రవేశించినప్పటి నుంచి బాలికపై అత్యాచారం వరకు జరిగిన సంఘటనల గురించి పోలీసులు సాదుద్దీన్ వద్ద ప్రస్తావించారు. అందులో కొన్నింటికి సాదుద్దీన్ సమాధానాలివ్వగా.. మిగతా వాటికి తెలియదని చెప్పాడు. ఈ కేసులో ముగ్గురు మైనర్ బాలురను జస్టిస్ జువైనల్ బోర్డు కస్టడీకి అనుమతించింది. 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నుంచి వాళ్లను ప్రశ్నించనున్నారు. సైదాబాద్‌లోని జువైనల్ హోంలోనే ముగ్గురు మైనర్ బాలురను ప్రశ్నించనున్నారు. మైనర్ బాలికను మభ్యపెట్టి కారులో ఎక్కించుకొని సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తాము చేసేది తప్పని తెలిసినప్పటికీ ఐదుగురు మైనర్ బాలురు తీవ్ర నేరం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నేరాభియోగపత్రం దాఖలు చేసే సమయంలో ఐదుగురు మైనర్ బాలురను కూడా మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో జూబ్లీహిల్స్ పోలీసులున్నారు. ఈ మేరకు న్యాయసలహా తీసుకుంటున్నారు.
అత్యాచార బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పు.. అత్తింటివారి ఘాతుకం!