gold seized: అధికారులే అవాక్కయ్యేలా... ఇలా కూడా బంగారం తరలించొచ్చా..! - శంషాబాద్లో బంగారం పట్టివేత
17:54 September 02
శంషాబాద్ విమానాశ్రయంలో 495 గ్రాముల బంగారం పట్టివేత
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కాదేదీ కవితకు అనర్హం కాదన్నాడు మహాకవి శ్రీశీ.. అయితే చెప్పులు, క్రీము కప్పులు, హెయిర్ క్లిప్పులు కావేవీ బంగారం అక్రమ రవాణాకు అనర్హమని నిరూపిస్తున్నారు ప్రస్తుతం కొందరు. అధికారులే ఆశ్చర్యపోయే రీతిలో దుబాయ్ నుంచి బంగారం తీసుకొస్తూ.. ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. 24 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని.. చెప్పులు, ఫేస్ క్రీము, హెయిర్ స్ట్రయిట్‌నర్‌లో దాచుకుని తెచ్చాడు.
కానీ పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని.... బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:iPhones seized: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 80ఐఫోన్లు సీజ్