శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని దాదాపు కిలో విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను.. అనుమానంతో సీఐఎస్ఎఫ్ అధికారుల సహకారంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా ప్యాకింగ్ రూపంలో విదేశీ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రూ.44.8 లక్షల బంగారం స్వాధీనం
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.44.8 లక్షల విలువైన పుత్తడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 943 గ్రాముల విదేశీ గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రూ.44.8 లక్షల బంగారం స్వాధీనం
రూ.44.8 లక్షల విలువైన 943 గ్రాములు బంగారాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ ఇద్దరిపై హైదరాబాద్ అధికారులు కేసు నమోదు చేశారు. షార్జా నుంచి ఆ బంగారాన్ని తీసుకొచ్చినట్లు గుర్తించారు. షార్జా నుంచి గోవా, అక్కడ నుంచి హైదరాబాద్‌కు తెచ్చినట్లు తమ విచారణలో తెలినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కరోనా పరీక్షలు భారీగా పెంచాలని సీఎం ఆదేశం