నిజామాబాద్ జిల్లా బోధన్ బస్టాండ్‌లో.. నిన్న రాత్రి సినీఫక్కీలో ఘరానా దొంగతనం జరిగింది. కాపుకాసి మరీ నగలవ్యాపారి నుంచి దుండగులు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారీ చోరీ.. టికెట్ కోసం వెళ్లి వచ్చేలోపు బ్యాగ్ మాయం - nizamabad district news

17:23 August 13
భారీ చోరీ.. టికెట్ కోసం వెళ్లి వచ్చేలోపు బ్యాగ్ మాయం
హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి దళపత్ సింగ్ నుంచి 41 తులాల బంగారం, 7 కిలోల వెండి, లక్ష నగదును దోచుకెళ్లారు. బోధన్‌లోని దుకాణాలకు బంగారం, వెండి ఇచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లడానికి బస్ ఎక్కారు. తన సీట్లో బ్యాగ్‌ను ఉంచి టికెట్ తీసుకోవడానికి డ్రైవర్ వద్దకు వెళ్లగానే.. అక్కడే కాపుకాసిన దుండగులు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. గ్రహించిన బాధితుడు.. బోధన్ పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. దొంగలముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇదీచూడండి:'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు