తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని సిర్పూర్ టి మండలం మాకిడి గ్రామ శివారులో మంగళవారం రాత్రి మేకల మంద రైలు పట్టాలు దాటుతుండగా దిల్లీ యశ్వంత్పూర్ రైలు ఢీకొంది. ప్రమాదంలో 40 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని మంచిర్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ తెలిపారు.
రైలు ఢీకొని 40 మేకలు మృతి - మేకల మందను ఢీకొన్న యశ్వంత్పూర్ రైలు
రైలు ఢీకొని 40 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలో జరిగింది.
కుమురం భీం జిల్లా వార్తలు
ఈఘటనలో రైలు ఏసీ కంప్రెషర్ పైపు పగిలిపోవడం వల్ల రెండు గంటలపాటు నిలిచిపోయింది.
ఇదీ చూడండి:కొవిడ్ మృతుల అంత్యక్రియలు: ఇప్పుడిదే నయా బిజినెస్