తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుదాఘాతంతో 40 మేకలు మృతి.. - 40 goats died of electrocution

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో 40 మేకలు మృతి చెందాయి. తక్షణమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.

40 goats died due to electric shock took place in Vasuram Tanda, Kolcharam mandal, Medak district
విద్యుదాఘాతంతో 40 మేకలు మృతి..

By

Published : Mar 8, 2021, 4:27 PM IST

విద్యుదాఘాతంతో 40 మేకలు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం వసూరం తండాలో చోటుచేసుకుంది. రమావత్ సూర్య కూలి పని చేసుకుని జీవనం సాగిస్తూ... మేకలను పెంచేవాడు. వాటి పైనే ఆధారపడి జీవనం సాగిస్తుండేవాడు. రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు పశువులపాక విద్యుదాఘాతానికి గురి కావడంతో ఈ ఘటన జరిగింది.

రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కోరాడు. వాటిని కాపాడే ప్రయత్నంలో రమావత్ సూర్య పెద్ద కుమారుడు బాలకిషన్​కు స్వల్ప గాయాలయ్యాయి.

ఇదీ చదవండి:క్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం.!

ABOUT THE AUTHOR

...view details