తెలంగాణ

telangana

ETV Bharat / crime

MISSING: క్వారీ గుంతలో నలుగురు యువకులు గల్లంతు - crime news

వేడుకలు చేసుకోవడానికి వెళ్లి నలుగురు యువకులు క్వారీగుంతలో గల్లంతైన విషాద ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా బోయపాలెంలో చోటుచేసుకుంది. గల్లంతైన యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

MISSING: క్వారీ గుంతలో నలుగురు యువకులు గల్లంతు
MISSING: క్వారీ గుంతలో నలుగురు యువకులు గల్లంతు

By

Published : Jul 11, 2021, 8:17 PM IST

MISSING: క్వారీ గుంతలో నలుగురు యువకులు గల్లంతు

ఏపీలోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. డైట్ కాలేజ్ సమీపంలోని క్వారీ గుంతలో ఈతకు దిగి నలుగురు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో గల్లంతైనవారు ప్రత్తిపాడుకు చెందిన సాయిప్రకాశ్, వెంకటేశ్, వంశీ, శంకర్​గా గుర్తించారు. ఆరుగురు యువకులు క్వారీ వద్ద పార్టీ చేసుకోవడానికి వెళ్లగా.. వీరిలో నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఘటన జరిగిన ప్రదేశానికి ఆర్డీవో భాస్కర్​ రెడ్డి, గుంటూరు అర్బన్​ ఎస్పీ వెళ్లి పరిశీలించారు.

ఇదీ చదవండి: Three died in river: నదిలో మునిగి ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details