Road accident: నూతన సంవత్సర వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంతా ఆనందంగా ఉండగా.. రెండు కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఓ మహిళతో పాటు.. ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉంది.
Road accident: న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి.. - couple and 8 months child died in accident
15:11 January 01
Road accident: న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు(28), శ్రావణి(22) దంపతులు జహీరాబాద్‌లో నివాసముంటూ.. రెడిమేడ్ దుస్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజూలాగే.. ఈరోజు కూడా దంపతులిద్దరు తమ కుమార్తె అమ్ములు(8 నెలలు)తో కలిసి ద్విచక్రవాహనం మీద వ్యాపారం చేసుకునేందుకు వెళ్తున్నారు.
అదేసమయంలో.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్‌కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25) కారులో బీదర్ నుంచి జహీరాబాద్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. పల్టీలు కొడుతూ వచ్చి.. బాలరాజు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా.. బాలరాజు దంపతులు, కారులోని ఫరీద్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
వ్యాపారానికి బయలుదేరిన దంపతులతో పాటు చిన్నారి.. మృతి పట్ల తోటి వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పని చేస్తూ ఉపాధి పొందుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: