చెరువులో స్నానానికి దిగి.. నలుగురు చిన్నారులు మృతి - ప్రకాశం తాజా వార్తలు
19:39 June 11
చెరువులో స్నానానికి దిగి.. నలుగురు చిన్నారులు మృతి
ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి దిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన జరుగుమిల్లి మండలం అక్కచెరువు పాలెంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మొత్తం ఆరుగురు పిల్లలు చెరువులో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు బాలికలను స్థానికులు కాపాడి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగతా నలుగురి మృతదేహాలను చెరువులో నుంచి వెలికి తీశారు.
మృతులు కౌశిక్(16), సుభాష్(11), సుబ్రహ్మణ్యం (15), హరి భగవన్నారాయణ(10)గా గుర్తించారు. ఒకే గ్రామంలో నలుగురు మృతి చెందడంతో అక్కచెరువుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పరామర్శించారు.
ఇవీ చదవండి: