తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం.. సాంబారులో పడి మూడేళ్ల బాలుడు మృతి - కర్నూలు జిల్లా

ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సాంబారులో పడి మృతి చెందాడు. అప్పటి వరకు బుడిబుడి అడుగులు వేస్తూ సందడిగా తిరిగిన బాబు.. ఒక్కసారిగా ఒళ్లు కాలిపోయి ఏడవటం చూపరులను కన్నీరు పెట్టించింది. మూడు రోజులుగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో కన్నవారి శోకాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు.

విషాదం.. సాంబారులో పడి మూడేళ్ల బాలుడు మృతి
విషాదం.. సాంబారులో పడి మూడేళ్ల బాలుడు మృతి

By

Published : Nov 14, 2022, 9:10 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటుచేసుకుంది. ఎర్రకోటకు చెందిన సోమనాథ్ అనే బాలుడు వేడి సాంబారులో పడి మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఎమ్మిగనూరులో తమ బంధువుల ఇంట్లో పూజకు బాలుడిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు వేడి సాంబారులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి వరకు బుజ్జిబుజ్జి మాటలతో సందడి చేసిన బాబు.. కాలిన గాయాలతో ఏడవటం అందరినీ కలచివేసింది. బాబును బతికించుకునేందుకు చికిత్స కోసం కర్నూలుకు తరలించినా.. ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవీ చదవండి..:

ABOUT THE AUTHOR

...view details