ఓ ద్విచక్ర వాహనంపై ఉన్న పెండింగ్ చాలన్లు చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్‌లో జరిగింది. పట్టణంలోని రాజీవ్ చౌక్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ29 బీహెచ్ 3534 అనే బైక్‌ను ఆపి చెక్ చేశారు. ఈ క్రమంలో బైక్‌పై మొత్తం 36 చాలన్లు, రూ.23,655 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.
టూవీలర్‌పై 36 పెండింగ్ చాలన్లు - telangana news today
తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ బైక్‌ను చెక్ చేశారు. దీంతో 23,655 రూపాయల విలువైన 36 చాలన్లు పెండింగ్‌లో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
![టూవీలర్‌పై 36 పెండింగ్ చాలన్లు challans cheating, narayankhed crime news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11394035-939-11394035-1618344939339.jpg)
టూవీలర్‌పై 36 పెండింగ్ చాలన్లు
వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేసినట్లు స్థానిక ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చాలన్లు కట్టిన తర్వాతనే వాహనం విడుదల చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో దేహశుద్ధి