ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి - రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి
17:07 October 07
ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కౌకుంట్లలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. జీవాలను కుక్కలు తరమడంతో ఒక్కసారిగా రైలు పట్టాలపైకి వచ్చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన రైలు గొర్రెలను ఢీకొట్టింది. ప్రమాదంలో 335 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. వీటి విలువ రూ.33.5 లక్షల మేర ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: