తెలంగాణ

telangana

ETV Bharat / crime

cash stolen in postoffice: తపాలా కార్యాలయంలో రూ.33 లక్షలు చోరీ ఎక్కడంటే.. - హైదరాబాద్ తాజా నేర వార్తలు

cash stolen in postoffice: గుర్తుతెలియని దుండగులు పోస్టాఫీసులో ఏకంగా రూ.33 లక్షలు చోరీ చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్​లో చోటుచేసుకుంది. పోస్ట్‌మాస్టర్‌ శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

bhel hyderabad post office cash stolen
హైదరాబాద్ భెల్ టౌన్​షిప్​లోని పోస్టాఫీసులో చోరి

By

Published : Feb 14, 2022, 12:06 PM IST

cash stolen in postoffice: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ టౌన్​షిప్​లో ఉన్న ప్రధాన పోస్టల్ కార్యాలయంలో ఫించన్ డబ్బులు పంపిణీ చేసేందుకు పటాన్ ​చెరువు ఎస్బీఐ నుంచి రూ. 20 లక్షలను పోస్టల్ అధికారులు శుక్రవారం సాయంత్రం డ్రా చేసి తెచ్చి లాకర్లో పెట్టారు. ఇది ప్రధాన పోస్టాఫీసు కావడంతో బ్రాంచి ఆఫీసులు ఇతర ఖాతాదారుల నుంచి దాదాపుగా 13 లక్షల వరకూ నగదు వచ్చింది. రెండింటిని పోస్టల్ లాకర్లో ఉంచి అధికారులు తాళం వేసి వెళ్లిపోయారు.

తర్వాత ఏం జరిగిదంటే..

గుర్తుతెలియని దుండగులు లోపలకు చొరబడి లాకర్ కత్తిరించి దాదాపుగా రూ .33 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది అనేది పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు వాచ్​మెన్ దుప్పటికి నిప్పంటించి దస్త్రాలు ఇతర వస్తువులు తగలబెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చినా.. చోరీపై పలు అనుమానాలు వ్యక్తమతున్నాయి.

దుప్పటికి నిప్పుపెట్టి తపాలా కార్యాలయంలో అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్‌మాస్టర్‌ శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మహేశ్​ బ్యాంక్​ సర్వర్ హ్యాకింగ్ కేసులో మణిపుర్​ యువతుల హస్తం

ABOUT THE AUTHOR

...view details