నిజామాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. వర్ని శివారులో జకోరా చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు... ఓ బొలెరోలో నిత్యవసర సరుకుల మధ్య తరలిస్తున్న గంజాయితో పాటు మరో కారులో... అక్రమంగా జిల్లాకు తీసుకొస్తున్న 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
320 కిలోల గంజాయి స్వాధీనం... ఐదుగురు అరెస్ట్ - nizambad latest news
సంగారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న 320 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు నిందితులతో పాటు ఓ బొలెరో, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 22 లక్షలుంటుందని తెలిపారు.
320 kilograms of ganja seized and 5 arrested
సంగారెడ్డి జిల్లా రేగోడ్ మండలం రాయిలొంక తండా నుంచి జైపాల్, సుభాష్ అనే వ్యక్తులు నిజామాబాద్‌కు చెందిన మరో ముగ్గురి సాయంతో గంజాయిని నిజామాబాద్‌కు తరలిస్తున్నట్లు సీఐ దీపిక తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 22 లక్షలుంటుందని తెలిపారు.