తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cannabis seize : పైన దానిమ్మ పండ్లు... లోపల భారీగా గంజాయి ప్యాకెట్లు - cannabis seized in Hyderabad

హైదరాబాద్​ నుంచి దానిమ్మ పండ్ల లోడ్​తో రాజమండ్రి వెళ్లిన ఇద్దరు స్నేహితులు.. ఆ ప్రాంతంలోని గోకవరం అడవిలో నుంచి గంజాయిని తీసుకొచ్చారు. ఈ గంజాయిని హైదరాబాద్ మీదుగా బీదర్​కు తరలిస్తుండగా.. కొత్తపేట్​లో ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా.. పరారైన మరొకరి కోసం గాలిస్తున్నారు.

320 కిలోల గంజాయి పట్టివేత
320 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Jul 22, 2021, 1:12 PM IST

Updated : Jul 22, 2021, 2:12 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి నుంచి కర్ణాటకలోని బీదర్​కు తరలిస్తున్న గంజాయిని రాచకొండ పోలీసులు హైదరాబాద్​లో పట్టుకున్నారు. సరూర్​నగర్​ పీఎస్ పరిధిలోని కొత్తపేట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్​ఓటీ పోలీసులు.. బొలేరో వాహనంలో తరలిస్తున్న 320 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజ్​కుమార్ అనే నిందితుణ్ని అరెస్ట్ చేశారు.

బీదర్​కు చెందిన వ్యక్తులు..

బీదర్​కు చెందిన రాజ్​కుమార్.. సరూర్​నగర్​లో ఉంటూ ప్రైవేట్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. ఇదే నగరంలో ఉంటున్న రంగలాల్​ అనే వ్యక్తి కూడా బీదర్​కు చెందిన వాడే. ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈనెల 19న బొలేరో వాహనంలో దానిమ్మ పండ్లు తీసుకుని రాజమండ్రి వెళ్లడానికి రాజ్​కుమార్​కు కిరాయి వచ్చింది.

దానిమ్మ పండ్ల లోడ్​తో రాజమండ్రికి..

ఈ విషయం తెలుసుకున్న రంగలాల్.. తిరిగివచ్చే అప్పుడు గంజాయి తీసుకొద్దామని రాజ్​కు చెప్పాడు. దీనికి అంగీకరించిన రాజ్.. తనతో రంగలాల్​ను రాజమండ్రి తీసుకువెళ్లాడు. దానిమ్మ పండ్ల లోడ్​ను రాజమండ్రిలో దింపి.. అక్కణ్నుంచి గోకవరం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి గంజాయిని ప్యాకెట్లలో నింపి హైదరాబాద్ మీదుగా బీదర్​కు బయలుదేరారు.

320 కిలోల గంజాయి..

ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు కొత్తపేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చి బొలేరో వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో 320 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని రాజ్​కుమార్​ను అరెస్టు చేశారు. పోలీసులను చూసిన రంగలాల్​ అక్కణ్నుంచి పరారీ కావడంతో అతడి కోసం గాలిస్తున్నారు.

Last Updated : Jul 22, 2021, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details