మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట వద్ద ఓ ఆటోలో తరలిస్తున్న రూ.32 లక్షల విలువ చేసే 64 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు (32 lakh worth ganja seized). గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు మూడు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనం, ఆటోను సీజ్ చేశారు.
32 lakh wroth ganja seized: ఆటోలో తరలిస్తున్న పార్శిళ్లు... తెరిచి చూస్తే.. - బయ్యారంలో గంజాయి స్వాధీనం
గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 32 లక్షల విలువైన 64 కిలోల గంజాయి (32 lakh worth ganja seized), ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బయ్యారం ఎస్సై.. సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా... అనుమానాస్పదంగా కనిపించిన ఓ ఆటోలో సోదాలు చేశారు. ఎండు గంజాయి ప్యాక్ చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు (32 lakh worth ganja seized). నిందితులు హనుమకొండ జిల్లాకు చెందిన భూక్య తిరుపతి, బోడ దేవేందర్, భూక్య రాజేందర్ అని పోలీసులు తెలిపారు. వీరు సీలేరు ప్రాంతంలో గంజాయి తక్కువ ధరకు కొని... ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాలకు తరలిస్తారని వివరించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:ganja smugling: గంజాయి విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. ఓ ముఠా అరెస్ట్..