తెలంగాణ

telangana

ETV Bharat / crime

దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష - hyderabad crime news

దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడికి పాల్పడిన హోంగార్డుకు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత ఏడాది అక్టోబర్​లో లైంగికదాడికి పాల్పడగా... ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బాలిక గర్భం దాల్చడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

nampally court
nampally court

By

Published : Aug 3, 2021, 10:26 PM IST

దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు హైదరాబాద్​ నాంపల్లి న్యాయస్థానం 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. సీసీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న మల్లికార్జున్​.. గతేడాది అక్టోబరు నెలలో తుకారంగేట్‌ ప్రాంతంలో నివసించే దివ్యాంగురాలైన బాలిక ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశాడు. రెండు సార్లు లైంగిక దాడి చేసిన హోంగార్డు.. విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బాలికను బెదిరించాడు.

ఐదు నెలల తర్వాత బాలిక గర్భం దాల్చడంతో లైంగిక దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన పోలీసులు హోంగార్డును అరెస్ట్​ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హోంగార్డు లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువుకావడంతో.. నిందితుడికి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ఇదీచూడండి:SEXUAL HARASSMENT ON TRAINEE SI: లైంగిక ఆరోపణలతో మరిపెడ ఎస్ఐపై సస్పెన్షన్‌ వేటు

ABOUT THE AUTHOR

...view details