తెలంగాణ

telangana

ETV Bharat / crime

బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు - AP Students missing news

చెన్నై మెరీనా బీచ్‌లో ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన శివబాలాజీ, గోపీశాంత్‌, ఆకాశ్‌ గల్లంతయ్యారు. వీరిలో శివబాలాజీ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు.

3-vijayawada-students-missing-in-chennai-merina-beach
బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు గల్లంతు

By

Published : Feb 12, 2021, 12:30 AM IST

Updated : Feb 12, 2021, 2:07 AM IST

తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో నీట మునిగి ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. చనిపోయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా విద్యార్థి. మిగిలిన ఇద్దరు కృష్ణాజిల్లాకు చెందిన వారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్‌(18) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

చెన్నైలో ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశం పొందడానికి గంపలగూడెం మండలం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్‌(18) పాటు గుంటూరు గ్రామీణ మండలం పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండు రోజుల కిందట చెన్నై వెళ్లారు.

అక్కడ ఉన్న మరో ఇద్దరు మిత్రులు రాజశేఖర్‌, శివ ప్రశాంత్‌తో కలిసి గురువారం మెరీనా తీరానికి వెళ్లారు. రాజశేఖర్‌, శివప్రశాంత్‌ ఒడ్డున ఉన్నారు. మిగిలిన వారు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:అంతరాష్ట్ర బండలాగుడు పోటీలు

Last Updated : Feb 12, 2021, 2:07 AM IST

ABOUT THE AUTHOR

...view details