తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు - ఏపీ నేర వార్తలు

చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విజయవాడ విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్ల గాలింపు చర్యలు చేపట్టారు.

చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు
చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు

By

Published : Feb 11, 2021, 10:55 PM IST

చెన్నై మెరీనా బీచ్‌లో ముగ్గురు విజయవాడ విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఆవడి ఇంజినీరింగ్‌ కళాశాలలో అడ్మిషన్‌ కోసం విజయవాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు చెన్నై వెళ్లారు. కౌన్సెలింగ్‌ తర్వాత మెరీనా బీచ్‌ సందర్శించారు.

మధ్యాహ్నం సముద్రంలోకి దిగిన శివబాలాజీ, గోపీశాంత్‌, ఆకాశ్‌ గల్లంతయ్యారు. వీరిలో శివబాలాజీ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీసి... చెన్నై రాయపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి:లైవ్​ వీడియో: అలా నటించారు.. మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details