నల్గొండ జిల్లా పెద్దవూరలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని గుర్రంపోడు మండలం తేనేపల్లి తండాకు చెందిన సురేశ్ తన కారులో మిర్యాలగూడలోని ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పెద్దవూరలో ఎదురుగా వచ్చిన టాప్ సీలింగ్ లోడ్‌తో వాహనం ఢీకొనడంతో.. ప్రమాదం చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా... మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈ ఘటనలో కారు డ్రైవర్ సురేశ్... అక్కడిక్కడే మృతి చెందారు. అతని తల్లి చారు(47), తన కుమార్తె(15నెలల పాప) నల్గొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టెంపో డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: