Road Accidents in Telangana: సికింద్రాబాద్లో వేగంగా వెళ్తున్న పాల వ్యాను.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హకీంపేట్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న మాధవరెడ్డి డ్యూటీ నిమిత్తం బస్ దిగి హకీంపేట డిపో వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన పాల వ్యాను అతనిని ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో మాధవరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పాల వ్యాన్ డ్రైవర్ను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు.
ఇద్దరు మృతి..
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీ, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. కొర్విపల్లికి చెందిన కుటుంబం బైక్‌పై శంకరపేటకు అంగడికి వెళ్లి... తిరుగుప్రయాణమైంది. అంబాజీపేట శివారు వద్ద చేరుకోగానే అటుగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. అతని తండ్రి బీరయ్య ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తల్లి రాజవ్వను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.