ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి - telangana crime news
![ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14733264-830-14733264-1647277272429.jpg)
22:21 March 14
ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ముగ్గురు మృతి
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం పద్మాజివాడి వద్ద ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమం ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.
మృతులు లింగంపేట మండలం కొండాపూర్‌కు చెందిన చోటేమియా(50), కౌరున్(45), సారిక్(70)గా గుర్తించారు. గాంధారి మండలం సీతాయిపల్లిలో అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదీచూడండి:TWO GIRLS FELL INTO A CANAL: ఆడుకునేందుకు వెళ్లి .. అనంతలోకాలకు