మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ రవాణాను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లను కొని... ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్లు.. ముగ్గురు నిందితులు అరెస్ట్ - మాస్ ఫౌండేషన్
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ రవాణాను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 120 కిలోల ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్లు.. ముగ్గురు నిందితులు అరెస్ట్ 3 arrest for oxygen cylinders illegal transport in moulali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11556057-146-11556057-1619519968057.jpg)
3 arrest for oxygen cylinders illegal transport in moulali
సయ్యద్ అబ్దుల్, మహమ్మద్ మజార్, ఆసీఫ్ అనే ముగ్గురు నిందితులు... ఎలాంటి అనుమతులు లేకుండా కరోనా రోగులకు ఎక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సిలిండర్ని రూ. 25 వేలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 120 కిలోల ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.