సైబర్ సెల్‌కు రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కేంద్రం ఏర్పాటు చేసిన సైబర్ సెల్ నంబర్‌కు గత రెండు నెలల్లోనే 2,513 ఫిర్యాదులు రాష్ట్రం నుంచి అందాయి. దాదాపు 24కోట్ల రూపాయలు మోసపోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ లెక్కన నెలకు రూ.12 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నట్లు అర్థమవుతోంది. స్థానిక పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ మొత్తం ఇంకా ఎక్కువే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రాజధానిలో గడిచిన కొన్ని నెలల్లో..
గత కొన్ని నెలలుగా సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 2,193 కేసుల్లో రూ.37కోట్లు, హైదరాబాద్‌లో 2,100 కేసుల్లో రూ.20కోట్లు, రాచకొండలో 1,600 కేసుల్లో.. రూ.7కోట్లను బాధితులు కోల్పోయారు. రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.40లక్షల వరకు సైబర్ నేరగాళ్లు నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. పెట్టుబడులు, కస్టర్ కేర్, కేవైసీ, ఉద్యోగం, పెళ్లి పేరుతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.