ఖమ్మంలో 250 కిలోల గంజాయి పట్టివేత - ఖమ్మంలో గంజాయి పట్టివేత
13:23 April 08
ఖమ్మంలో రూ.75 లక్షల విలువైన గంజాయి పట్టివేత
సుమారు 250 కిలాలో గంజాయిని ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలించేందుకు వాడిన రెండు ట్రాక్టర్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. ఒడిశా నుంచి గంజాయిని తరలించేందుకు ట్రాక్టర్లను ప్రత్యేకంగా రూపోందించారు. ట్రాక్టర్ కింది భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించారు.
ఖమ్మం బుర్హాన్‌పురంలో రాజస్థాన్‌కు చెందిన లారీల్లో ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని సీపీ విష్ణు వారియర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గంజాయిని అరికడుతూనే.. అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. గంజాయిని పట్టుకున్న పోలీసులకు సీపీ రివార్డులు అందజేశారు.