మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం, చౌవుళ్ల తండాల్లో పిచ్చి కుక్క సుమారు 25 మందిపై దాడి చేసింది. అందులో కొందరు స్వల్పంగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్వల్పంగా గాయపడిన వారిని నెల్లికుదురు ప్రభుత్వ ఆస్పత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పిచ్చి కుక్క దాడిలో 25 మందికి గాయాలు - mad dog attack in nellikuduru mandal
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పలు తండాల్లో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో సుమారు పాతిక మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
![పిచ్చి కుక్క దాడిలో 25 మందికి గాయాలు mad dog attack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11076826-278-11076826-1616160967897.jpg)
పిచ్చికుక్క దాడి
వారికి యాంటీ రేబిస్ టీకా ఇచ్చి చికిత్సను అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను గ్రామస్థులు వేడుకున్నారు.
ఇదీ చదవండి:హెల్మెట్ లేకుండా బైక్పై పోలీసులు.. నిలదీసిన యువకుడు
Last Updated : Mar 19, 2021, 7:20 PM IST