తెలంగాణ

telangana

ETV Bharat / crime

హయత్​నగర్​లో గంజాయి పట్టివేత.. రిమాండ్​కు నిందితులు - marijuana seized in hayathnagar news

నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, లారీ, నగదు స్వాధీనం చేసుకున్నారు.

marijuana seized
గంజాయి స్వాధీనం

By

Published : Apr 14, 2021, 3:34 PM IST

నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు హయత్​ నగర్​లో అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని అరకు నుంచి ఉత్తరప్రదేశ్​కు గంజాయిని ఇద్దరు తరలిస్తుండగా.. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎస్​ఓటీ పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 200 కేజీల గంజాయి, ఒక లారీ, రూ. 15వేల నగదు, మూడు చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్​ చేసిన గంజాయి విలువ రూ. 40లక్షలపైనే ఉంటుందని సీపీ మహేష్​ భగవత్​ తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details