యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్‌లో ఓ దుకాణదారునికి గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తుండగా.. ముగ్గురు నిందితులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20లక్షల విలువైన 66 సంచుల గుట్కా, స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
'కుమావత్ సురేశ్, కుమావత్ రాహుల్, మనరాం ప్రకాశ్, అబ్బు అనే వ్యక్తులు అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారు. వీరు కర్ణాటకలోని బీదర్‌లో తక్కువ ధరతో భారీ మొత్తంలో గుట్కా కొనుగోలు చేసి.. వివిధ వాహనాల్లో తీసుకొస్తున్నారు. ఫీర్జాదిగూడలోని ఓ గోడౌన్లో నిల్వచేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు' అని డీసీపీ పేర్కొన్నారు.