మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవాహార్ నగర్ బ్యాంక్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు కలకలం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనం చేశారు. కిటికీని ధ్వంసం చేసి బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, 96 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ రోజు ఉదయమే ఇంటికి చేరుకున్న యజమానికి... కిటికీలు ధ్వంసం అయి ఉండటం కనిపించింది.
THEFT: అర్ధరాత్రి చోరీ.. 20 తులాల బంగారం, రూ.96 వేలు అపహరణ - MEDCHAL LATEST NEWS
మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ బ్యాంకు కాలనీలో అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీని తొలగించి చొరబడిన దొంగలు... 20 తులాల బంగారం, 96 వేల రూపాయల నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అర్ధరాత్రి చోరీ.. 20 తులాల బంగారం, రూ.96 వేలు అపహరణ
అనుమానం వచ్చిన అతను వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడడంతో చోరీ జరిగినట్లు గ్రహించాడు. 20 తులాల బంగారం, 96 వేల రూపాయలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.