Fake Notes at Madhapur : హైదరాబాద్ మాదాపూర్‌లో నమూనా రెండు వేల నోట్ల కాగితాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం కాకతీయహిల్స్ కమాన్ సమీపంలో రోడ్డుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని నమూనా రెండు వేల నోట్ల కాగితాలను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
Fake Notes at Madhapur : రోడ్డుపై గుట్టలు గుట్టలుగా 2 వేల నోట్లు.. తీరా చూస్తే..!! - Rs.2000 notes at madhapur
Fake Notes at Madhapur : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.2వేల నోట్లు కలకలం సృష్టించాయి. కాకతీయ రోడ్డులో రూ.వేల నోట్లు గుట్టలుగుట్టలుగా కనబడటంతో స్థానికులు ఎగబడ్డారు. ఎవరికి అందిన వాడికి వారు తీసుకుని వెళ్లిపోయారు. తీరా ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండటంతో ఫేక్ నోట్లని తెలిసి నిరాశ చెందారు.
Fake Notes at Madhapur
Fake Rs.2000 Notes at Madhapur : అటువెళ్తున్న స్థానికులు, వాహనదారులు వాటిని నిజమైన నోట్లుగా భావించి తీసుకునేందుకు పోటీపడ్డారు. తీరా వాటిని పరిశీలిస్తే, అవి నమూనా కాగితాలుగా తేలడంతో అంతా ఉసూరుమన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచామూ లేదని మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ చెప్పారు.