తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. వ్యక్తి అరెస్ట్ - latest crime news in mancherial

మంచిర్యాల జిల్లాలోని బురదగూడెంలో రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

Seizure of two quintals of counterfeit cotton seeds
రెండు క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

By

Published : May 25, 2021, 3:05 PM IST

రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్న వారి స్థావరాలపై పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే మందమర్రి పోలీసుల సహకారంతో బురదగూడెం గ్రామంలో రెండు క్వింటాళ్ల నకలీ పత్తి విత్తనాలను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో పుట్టగంటి రామారావును అరెస్ట్ చేశారు. ఇందులో ఇంకా ఎవరి సహకారమైనా ఉందా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ విత్తనాలు అమ్ముతూ... అమాయక రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ దాడిలో రామగుండం టాస్క్​ఫోర్స్ సీఐ ఎ.కె.మహేందర్, మందమర్రి సీఐ ప్రమోద్ కుమార్, టాస్క్​ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, మందమర్రి ఎస్సై భూమేష్, టాస్క్​ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, వెంకటేష్, రాకేష్, ఓంకార్, భాస్కర్ గౌడ్ , సంపత్ కుమార్​లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details