శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత - 2 కిలోల 961 గ్రాముల బంగారం స్వాధీనం
15:16 December 10
gold seizure at Shamshabad airport
gold seizure at Shamshabad airport శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈ ఉదయం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఎఫ్‌జడ్ 461 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా... అనుమానిత బ్యాగ్ కనిపించింది. క్షుణ్ణంగా అధికారులు పరిశీలించగా దొరికిన స్మగ్లింగ్ బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగేజీలో 24 క్యారెట్ బంగారం బిస్కెట్లు, 1414 గ్రాముల బరువు గల 18 క్యారెట్ ఆభరణాలు లభ్యమయ్యాయి.
సుమారు 1.38 కోట్ల రూపాయలు విలువైన మొత్తం 2961 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమంగా తెచ్చిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్ నుంచి దొంగచాటుగా భారత్‌లో బంగారం బిస్కెట్లు, ఆభరణాలు ఎవరికి చేరవేయడానికి తెస్తున్నారన్న కోణంలో కస్టమ్స్ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇవీ చూడండి: