Gold seized in shamshabad : శంషాబాద్ విమానాశ్రయంలో 2.7 కిలోల బంగారం పట్టివేత - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
![Gold seized in shamshabad : శంషాబాద్ విమానాశ్రయంలో 2.7 కిలోల బంగారం పట్టివేత Gold seize in shamshabad, gold smuggling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14251428-646-14251428-1642831356309.jpg)
10:41 January 22
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
Gold seized in shamshabad : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ.కోటి 36లక్షల విలువైన 2,715.800గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దుబాయ్ నుంచి 6E025 విమానంలో వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ ప్రయాణికుడు రెండున్నర కిలోలకు పైగా ఉన్న గోల్డ్ చైన్‌లతో పాటు... బంగారాన్ని పేస్టుగా తయారు చేసి ప్యాక్ చేసుకుని తీసుకువచ్చినట్లుగా గుర్తించారు.
అతడి బ్యాగును క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు... లగేజీ బ్యాగులో ఉన్న బంగారాన్ని గుర్తించి వెలికి తీశామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.