Road accident: గత ఏడాదికి వీడ్కోలు చెబుతూ... నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఈ సంబురాలు జరుపుకునే వేళ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్న వారిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది.
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య(50) రేణమ్మ(40) భార్య భర్తలు. మల్లయ్య తమ్ముడు బాలస్వామితో కలిసి ద్విచక్రవాహనంపై నాగర్ కర్నూలు పట్టణంలోని బంధువు ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక ముగించుకుని ఉప్పరపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. తెలకపల్లి మండలం రాకొండ, జినుకుంటా గ్రామాల సమీపంలో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది.