కరోనా బారిన పడిన బాధితులకు రెమ్‌డెసివిర్ ఇంజిక్షన్‌లు అందకుండా చేస్తున్న అక్రమార్కులను పోలీసులు కటకటాలకు పంపుతున్నారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉంచకుండా బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్ మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు.. ఇద్దరు అరెస్ట్ - సరూర్‌నగర్
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
![బ్లాక్ మార్కెట్‌లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు.. ఇద్దరు అరెస్ట్ 2 arrested for selling remdesivir injections in black market](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11570373-293-11570373-1619620434392.jpg)
2 arrested for selling remdesivir injections in black market
హెటిరో ఉద్యోగి నాగరాజు, మరో ప్రైవేటు ఉద్యోగి రమేశ్‌లకు కలిసి రూ. 35 వేల ఎమ్మార్పీ ధర ఉన్న ఇంజక్షన్‌లను అసలు ధర కంటే అధిక ధరకు కొత్తపేటలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్ శ్రీనివాస్
TAGGED:
సరూర్‌నగర్