నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ సమీపంలో 44 జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా(private bus accident today) పడింది. దీపావళి పండుగ కోసం హైదరాబాద్‌లో పనిచేసే కూలీలు, చిన్న ఉద్యోగులు సొంతూరికి వెళ్తుండగా... బస్సు ఒక్కసారిగా రహదారి పైనుంచి పల్టీలు కొట్టంది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
private bus accident today: దీపావళికి వెళ్తుండగా.. ప్రైవేటు బస్సు బోల్తా.. 17 మందికి తీవ్రగాయాలు - తెలంగాణ వార్తలు
07:25 November 03
ప్రైవేటు బస్సు బోల్తా, 17 మందికి తీవ్రగాయాలు
హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన(private bus accident today) జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా పలువురు కూలీలు సొంత గ్రామాలకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. బస్సులో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించడం... డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఘటన స్థలిలోనే బావి ఉందని... బస్సు అందులో పడితే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు రూరల్ ఎస్సై వినయ్ వెల్లడించారు.
ఉవాళ ఉదయం 5.46-6 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. యూపీ బస్సు ఇది. వీళ్లంతా హైదరాబాద్‌లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, చిన్న చిన్న కార్మికులు. దీపావళి కోసం హైదరాబాద్ నుంచి రాత్రి బయల్దేరారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల బస్సు పక్కకు వెళ్లిపోయేసరికి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకు ఏం జరగలేదు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు స్లోమోషన్లో పడిపోయింది కాబట్టి లక్కీగా సేవ్ అయ్యారు. పక్కనే వ్యవసాయ బావి కూడా ఉంది. స్పీడ్‌గా వస్తే చాలామంది గల్లంతయ్యే వారు. స్లోమోషన్లో రావడం వల్ల లక్కీగా పక్కకు ఒరిగింది.
-ఉపేందర్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ
ఇదీ చదవండి:భూ రికార్డులు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ఇంట్లో భారీగా సొత్తు