కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన పాప పేరుతో ఆస్పత్రి యాజమాన్యం నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి లక్షలు కాజేశారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. నల్గొండ జిల్లా పెద్దవురా మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన కె. చైత్ర(6)ను మార్చి 1న కాలిన గాయాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికే 9 లక్షల రూపాయలు ఆసుపత్రిలో చెల్లించారు.
చిన్నారికి చికిత్స పేరుతో నకిలీ అకౌంట్.. ఆసుపత్రిపై సీసీఎస్‌లో ఫిర్యాదు
నల్గొండ జిల్లా పెద్దవురా మండలం చిన్నగూడం గ్రామానికి చెందిన కె. చైత్ర(6) మార్చ్ 1న కాలిన గాయాలు అవడంతో నెల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెయిన్ బో ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికే 9 లక్షల రూపాయలు ఆసుపత్రిలో చెల్లించారు. ఈ పాప పేరుతో ఆస్పత్రి యాజమాన్యం నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి లక్షలు కాజేశారని తల్లిదండ్రులు ఈరోపిస్తూ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఆస్పత్రి యాజమాన్యం మిలన్ అనే ఫండ్ రైజింగ్ యాప్‌లో చైత్ర పేరుతో నకిలి అకౌంట్ క్రియేట్ చేశారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో రెయిన్ బో ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అకౌంట్ క్రియేట్ చేసింది తామేనని కుటుంబ సభ్యులకు యాజమాన్యం తెలిపింది. తమకు తెలియకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి 17 లక్షల వరకు ఫండ్ తీసుకున్నారని బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విషయం ఆస్పత్రి యాజమాన్యానికి తెలిసిపోవడంతో పాపను డిఛార్జ్ చేసి తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:ఆరేళ్లకే అనుకోని కష్టం.. ఆడిపాడే వయస్సులో ఆసుపత్రికి పరిమితం