తెలంగాణ

telangana

ETV Bharat / crime

Girl rescued from human trafficking: కన్నతల్లే కూతురిని బలవంతంగా అలా చేయిస్తుంటే.. - girl rescued from human trafficking

Girl rescued from human trafficking: బలవంతంగా రొంపిలోకి దింపుతున్న తల్లి చెర నుంచి పదహారేళ్ల అమ్మాయిని చైల్డ్​లైన్​ ప్రతినిధులు కాపాడారు. ఆ అమ్మాయిని తమ రక్షణలోకి తీసుకుని విచారించగా.. మరిన్ని దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రతినిధులు వెంటనే ఆ అమ్మాయిని పోలీసులకు అప్పగించి.. తల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

16 years girl rescued from human trafficking by ChildLine Representatives
16 years girl rescued from human trafficking by ChildLine Representatives

By

Published : Dec 9, 2021, 3:44 PM IST

Girl rescued from human trafficking: చైల్డ్​ ట్రాఫికింగ్​కి పాల్పడుతున్న ఓ మహిళ నుంచి పదహారేళ్ల బాలికను హైదరాబాద్​ చైల్డ్​లైన్​ ప్రతినిధులు కాపాడారు. సదరు మహిళ.. బాధితురాలికి సొంత తల్లే కావటం గమనార్హం. బాలికను ఆమె చెర నుంచి కాపాడిన చైల్డ్​లైన్​ ప్రతినిధులు.. బంజారాహిల్స్​ పోలీసులకు అప్పగించారు. బాధితురాలితో ఆమె తల్లి బలవంతంగా భిక్షాటన చేయించటంతో పాటు లైంగిక వేధింపులకు గురిచేస్తోందని చైల్డ్​లైన్​ కోఆర్డినేటర్​ సల్మాన్​రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hyderabad ChildLine: నవంబర్​ 28న చైల్డ్​లైన్​ కార్యాలయాని(1098)కి ఓ ఫోన్​కాల్​ వచ్చింది. హైదరాబాద్​ అమీర్​పేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో.. ఓ 16 ఏళ్ల వయసున్న అమ్మాయితో ఆమె తల్లి బలవంతంగా భిక్షాటన చేయిస్తోందని ఆ ఫోన్​ కాల్​ సారాంశం. ఆ ఫోన్​ వచ్చిన వెంటనే.. చైల్డ్​లైన్​ ప్రతినిధి ఘటనా స్థలానికి చేరుకునేసరికి.. అక్కడి నుంచి బాలికతో పాటు ఆమె తల్లి పారారైంది. చుట్టుపక్కల వెతికినా దొరకలేదు.

16 years girl rescued: ఈ నెల 8న కూడా మళ్లీ ఓ ఫోన్​ వచ్చింది. ఖమ్మం బస్టాండ్​లో 16 ఏళ్ల బాలిక భిక్షాటన చేస్తోందని.. ఫోన్​ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. ఇదే తరహా ఫోన్​ 6 వ తేదీన కూడా రాగా.. అప్పుడు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. అప్పటి నుంచి కొంత అప్రమత్తంగా ఉన్న చైల్డ్​లైన్​ ప్రతినిధులు.. 8న కాల్​ రాగానే హుటాహుటిన ఖమ్మం బస్టాండ్​కు చేరుకున్నారు. బాలికను గుర్తించి తమ రక్షణలోకి తీసుకున్నారు. అమ్మాయిని ఆరా తీయగా.. తన తల్లి భిక్షాటనతో పాటు తనపై అత్యాచారం చేయిస్తుందని ప్రతినిధులకు తెలిపింది. వెంటనే బాలికను హైదరాబాద్​కు తరలించారు. బంజారాహిల్స్​ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం మొత్తం వివరించారు. చైల్డ్​లైన్ ప్రతినిధుల ఫిర్యాదుతో.. బంజారాహిల్స్ ఇందిరానగర్​లో నివసించే తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

"ఆ అమ్మాయి చెప్పిన వివరాలు ప్రకారం.. అంతకుముందు అమీర్​పేటలో భిక్షాటన చేసిన అమ్మాయి కూడా తనేనని నిర్ధరించుకున్నాం. బాలికను లోతుగా విచారించగా.. తన తల్లి చైల్డ్​ ట్రాఫికింగ్​ చేస్తోందని.. తనను లైంగికంగా వేధిస్తోందని తెలిపింది. ఆమెతో బలవతంగా భిక్షాటన చేపిస్తోంది. బాధితురాలి తల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుని.. మరే అమ్మాయి బలికాకుండా కాపాడాలి."- సాల్మన్​రాజు, చైల్డ్​లైన్​ కోఆర్డినేటర్​

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details