road accident: చెట్టును ఢీకొన్న టాటాఏస్ వాహనం, 16 మందికి గాయాలు - కామారెడ్డి నేర వార్తలు
18:51 November 29
కామారెడ్డి మండలం క్రిష్ణాజీవాడి వద్ద రోడ్డు ప్రమాదం
road accident: వివాహానికి వెళ్లి వస్తున్న బంధువుల వాహనం చెట్టును ఢీకొంది. ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కృష్ణాజీవాడి(krishnajiwadi) వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి:robbery attempt in muthoot finance :ముత్తూట్ ఫైనాన్స్‌లో పట్టపగలే దోపిడికి వచ్చారు..