రాష్ట్రంలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో చాక్లెట్ ఆశ చూపి ఇద్దరు బాలికలపై ఓ కీచకుడు ఆత్యాచారానికి పాల్పడ్డాడన్న వార్తను జీర్ణించుకునేలోపే మరో కామాంధుని అకృత్యం వెలుగుచూసింది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఉదంతం మరువక ముందే ఇంకో ఆరేళ్ల చిన్నారిపై మరో మైనర్ మానవ మృగం అత్యాచారానికి పాల్పడింది.
Kamareddy Rape: తెలంగాణలో మరో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం - kamareddy rape case
20:07 October 07
రాష్ట్రంలో మరో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం
కామారెడ్డి జిల్లాలో ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారానికి తెగబడ్డాడు. చెల్లిలాంటి చిన్నారిపై ఆ మైనర్ మదమెక్కిన మగాడిలా దుశ్చర్యకు తెగించాడు. బాలుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
వావివరుసల్లేవు.. చిన్నాపెద్దా తేడా లేదు.. ముక్కుపచ్చలారని చిన్నారులని కూడా చూడకుండా.. మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ సమాజానికి జుగుప్స కలిగిస్తున్నారు. మదపుటాలోచనలతో మొద్దుబారిపోయిన మొదళ్లతో.. కామంతో ముసుకుపోయిన కళ్లతో.. కోరలు చాస్తున్న ఆ కీచకుల కోరికలకు.. అభం శుభం తెలియని చిన్నారులు ఆగమవుతున్నారు. అసలేంజరుగుతుందో కూడా తెలియని వయసులో ఉన్న పసిపిల్లలపై పశువాంఛ తీర్చుకుంటున్న మానవమృగాలకు ఎలాంటి శిక్ష వేస్తే భయపడతారో తెలియని దుస్థితిలో సమాజం తలదించుకుంటోంది. ఇప్పుడిప్పుడే మూతిపై మీసం మొలుస్తోన్న ఆ మైనర్ మనసులో ఇంత క్రూరమైన ఆలోచనలు పుడుతున్నాయంటే.. తప్పు ఎక్కడ జరుగుతుందో..? సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవీ చూడండి: