DCCB Scam: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) బేల బ్రాంచిలో సంచలనం సృష్టించిన రూ. 2.86కోట్ల కుంభకోణంపై బేల పోలీసు స్టేషన్‌లో నమ్మకద్రోహం, మోసం అభియోగం కింద కేసు నమోదైంది. డీసీసీబీ జనరల్ మేనేజర్ అయిన బేల బ్రాంచి నోడల్ అధికారి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఆదివారం బేల స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపతికుమార్ సహా 15మందిపై ఐపీసీ 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ కోల నరేష్ తెలిపారు.కేసు నమోదైన 15 మందిలోశ్రీపతికుమార్ కుటుంబీకులతోపాటు డీసీసీబీ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.
DCCB Scam: డీసీసీబీ కుంభకోణంలో 15మందిపై కేసు నమోదు - ts news
DCCB Scam: డీసీసీబీ బేల బ్రాంచిలో జరిగిన 2కోట్ల 86లక్షల కుంభకోణంపై... ఆదిలాబాద్ జిల్లా బేల పోలీస్‌స్టేషన్‌లో నమ్మకద్రోహం, మోసం అభియోగం కింద కేసు నమోదైంది. డీసీసీబీ జనరల్ మేనేజర్, బేల బ్రాంచి నోడల్ అధికారి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు... స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపతికుమార్ సహా 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
adilabad DCCB Scam
బేల, చప్రాల ప్రాథమిక వ్యవసాయ ససహాకార సంఘాల ద్వారా పంట రుణాలు కోసం ఉంచిన నిధులను ఇతర ఖాతాలకు దారిమళ్లించారని సీఐ తెలిపారు. బాధ్యులైన ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి స్టేట్‌మెంట్‌ని నమోదు చేస్తామని తెలిపారు. బ్యాంకు నిధులను ఎవరెవరి ఖాతాల్లో వేశారనీ, దానికి కారణాలు, ఆధారాలను పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. ప్రాథమిక విచారణ ప్రక్రియ పూర్తయిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని సీఐ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Mar 15, 2022, 1:02 PM IST