తెలంగాణ

telangana

ETV Bharat / crime

BABY DEATH: నీటితొట్టిలో 17 రోజుల పసికందు.. ఏం జరిగిందంటే..? - child killed at nellore

ఏపీలోని నెల్లూరు నగరంలోని యాదవవీధిలో విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు బోసినవ్వులతో ఉయ్యాలలో ఉన్న 17 రోజుల చిన్నారి... కాసేపటికే నీటితొట్టెలో విగతజీవిగా దర్శనమిచ్చింది. ఉయ్యాలలో పడుకున్న బుజ్జాయిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు... పక్కింటి మేడపై ఉన్న నీటితొట్టెలో వేసి హత్య చేశారు.

papa death in nlr taza
papa death in nlr taza

By

Published : Jul 9, 2021, 6:48 PM IST

Updated : Jul 9, 2021, 7:24 PM IST

BABY DEATH: నీటితొట్టిలో 17 రోజుల పసికందు..ఏం జరిగిందంటే..!

బుజ్జి బుజ్జి పాదాలు.. చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చేసే కేరింతలు.. లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. ఇవన్నీ చూస్తూ ఆ తల్లి మురిసిపోయింది. చిట్టి తల్లిని ముద్దాడి.. ఊయలలో వేసి అమ్మమ్మ నిద్రపుచ్చింది. ఆ బోసి నవ్వుల పాపాయిని చూస్తూ.. పక్కనే తల్లీ నిద్రపోయింది. మెలకువ వచ్చి చూసే సరికి ఊయలలో పాప లేదు.. అప్పటికే ఆ తల్లి గుండె జారిపోయింది. చిన్నారి ఏమైందని ఇళ్లంతా వెతికింది. ముద్దుముద్దుగా చిరునవ్వులు చిందించే పాపాయి.. చివరికి నీటితొట్టిలో విగతజీవిగా పడి ఉండటం చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది.

ఏపీలోని నెల్లూరు నగరం యాదవవీధిలో 17 రోజుల పాపను గుర్తు తెలియని వ్యక్తులు నీటితొట్టిలో వేసి హత్య చేశారు. స్థానిక మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో.. ఉదయం 11 గంటల సమయంలో 17 రోజుల పసికందుకు అమ్మమ్మ శారదమ్మ స్నానం చేయించి ఉయ్యాలలో నిద్రపుచ్చింది. తల్లి కూడా నిద్రపోగా, అమ్మమ్మ కిందికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరో ఊయలలో ఉన్న పాపను తీసుకువెళ్లి పక్కింటి మేడ పైనున్న తొట్టిలో పడేశారు. మెలకువ వచ్చిన తల్లికి బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చివరికి నీటి తొట్టిలో చిన్నారి కనిపించింది.

వెంటనే బంధువులు, తల్లి కలిసి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ పాప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. పక్క ఇంట్లో నివసిస్తున్న తమ బంధువైన జ్యోతి చిన్నారిని హత్య చేసిందని చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాపను ఎవరు నీటి తొట్టెలో వేశారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: DRUNKEN DRIVER: కృష్ణగాడి వీర డ్రైవింగ్​ గాథ... మద్యం మత్తులో..

Last Updated : Jul 9, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details