తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gold Smuggling: 1144 గ్రాములు బంగారం అక్రమ రవాణా.. ఎలాగో తెలుసా..? - శంషాబాద్​ విమానాశ్రయం

Gold Smuggling: బంగారం అక్రమ రవాణా దందాకు ఎంచుకునే మార్గాలు.. నిత్య నూతనం. పోలీసులు కళ్లుగప్పి రకరకాల మార్గాల్లో వినూత్న రీతుల్లో బంగారాన్ని స్మగ్గింగ్​ చేస్తున్నారు. తాజాగా శంషాబాద్​ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద 1144 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంత బంగారాన్ని ఎలా తీసుకెళ్తున్నాడంటే..

144 grams of gold seized from a passenger at Shamshabad airport
144 grams of gold seized from a passenger at Shamshabad airport

By

Published : Mar 6, 2022, 9:41 AM IST

Gold Smuggling: అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా.. బంగారం అక్రమ రవాణా మాత్రం అగటం లేదు. బంగారం సరఫరా కోసం అక్రమార్కులు ఎన్ని ఎత్తులు వేసినా పోలీసులు చిత్తు చేస్తున్నా.. మరో కొత్త పైఎత్తుతో రవాణా చేస్తూనే ఉన్నారు. మళ్లీ పోలీసులకు దొరికిపోతూనే ఉన్నారు.

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి కస్టమ్స్‌ అధికారులు విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా... అతడి లోదుస్తులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబుల్లో 61.72 లక్షలు విలువ చేసే 1144 గ్రాములు బంగారం అక్రమంగా తీసుకువస్తున్నట్టు గుర్తించారు. దీంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని.. బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details