boy lost interest in studies and wanted to commit suicide: చదువుపై ఆసక్తి లేదని తాను రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని 14 ఏళ్ల బాలుడు ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే బ్లూ కోల్ట్స్ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లాలో జరిగింది. కడప ప్రకాష్ నగర్‌కు చెందిన బాలుడు వైయస్సార్ జిల్లా వల్లూరు మండలంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు.
చదువుపై ఆసక్తి లేక.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న బాలుడు.. - boy lost interest in studies
boy lost interest in studies and wanted to commit suicide: చదువుపై ఆసక్తి లేదంటూ 9వ తరగతి చదివే బాలుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ.. ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్ పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉత్తరంలో రాయడంతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్పారామం రైల్వే ట్రాక్ వద్ద బాలున్ని గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జరిగింది.

చదువుపై పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. తల్లిదండ్రులు చదువుకోమని చెప్పేవారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు చదువుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు చదువుపై ఆసక్తి లేదని ఆత్మహత్య చేసుకోనేందుకు రైల్వే పట్టాల వద్దకు వెళుతున్నానని ఉత్తరం రాసి వెళ్లాడు. వెంటనే తల్లిదండ్రులు చిన్నచౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బ్లూ కోల్ట్స్ పోలీసులు రంగం లోకి దిగి రైల్వే ట్రాక్ ను పరిశీలించగా శిల్పారామం సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద బాలుడు కనిపించడంతో అతని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవీ చదవండి: