తెలంగాణ

telangana

ETV Bharat / crime

బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్ - Latest news in Telangana

బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్
బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్

By

Published : Feb 18, 2021, 1:45 PM IST

Updated : Feb 18, 2021, 4:02 PM IST

13:43 February 18

బోయిన్‌పల్లి అపహరణ కేసులో 14 మందికి బెయిల్

 బోయిన్​పల్లి అపహరణ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14 మందికి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్ పల్లి ఠాణాలో హాజరుకావాలని...పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది.

 ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు ఇప్పటికే  బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో పోలీసులు మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. అఖిలప్రియతో కలిపి 15మంది బెయిల్ పొందారు. మరో ఆరుగురు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి... సికింద్రాబాద్ కోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురవడం వల్ల..... హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.

Last Updated : Feb 18, 2021, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details